రూ.12 మధ్యంతర డివిడెండ్
బెంగళూర్ : ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో 11 శాతం తగ్గుదలతో రూ.4,076 కోట్ల నికర లాభాలు ప్రకటిం చింది. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.4,591 కోట్ల లాభాలు నమోదు చేసింది. నోయిడా కేం ద్రంగా పని చేస్తోన్న ఈ కంపెనీ గడిచిన క్యూ3లో 13.3 శాతం పెరుగుదలతో రూ.33,872 కోట్ల రెవెన్యూ సాధిం చింది. 2024-25 క్యూ3లో రూ.29,890 కోట్ల రెవెన్యూ నమోదు చేసింది. 2025-26కు గాను మధ్యంతర డివిడెండ్ కింద ప్రతీ ఈక్విటీ షేర్‌కు రూ.12 కేటాయించింది. దీనికి రికార్డ్ తేదిగా జనవరి 16ను తీసుకుంది. సోమవారం ఎన్‌ఎస్‌ఈలో హెచ్‌సీఎల్‌టెక్ షేర్ 0.34 శాతం పెరిగి రూ.1,667 వద్ద ముగిసింది.
రూ.4,076 కోట్లకు తగ్గిన హెచ్‌సీఎల్ టెక్ లాభాలు
- Advertisement -
- Advertisement -



