వైద్య పరీక్షలు నిర్వహించాలి
వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
జిల్లాలోని ప్రజలకు ఆరోగ్య అవగాహన కల్పించాలని, వైద్య పరీక్షలు నిర్వహించాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఇంచార్జి కలెక్టర్ శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ దవాఖానల్లో డెలివరీలు, టీబీ, కుష్టు తదితర కేసులపై క్షుణ్ణంగా చర్చించారు. జిల్లాలో ఎన్ని కేసులు నమోదు అయ్యాయి? వారికి ఎలాంటి వైద్య సేవలు, మందులు అందిస్తున్నారో ఆరా తీశారు. టీబీ, కుష్టు నిర్ధారణకు కావాల్సిన కిట్లు, మందుల పై ఆరా తీశారు. టీబీ, కుష్టు వ్యాప్తితో కలిగే ఇబ్బందులు, ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, ఏరియా ఆసుపత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లలో రోగ నిర్ధారణ పరీక్షలు చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఎన్.సి.డీ స్క్రీనింగ్ ప్రక్రియ సకాలంలో పూర్తి చేసి అవసరమైన వారికి చికిత్స అందించాలని, క్యాన్సర్ పరీక్షలు చేసి తదుపరి చికిత్స అందించాలన్నారు. సమావేశంలో జిల్లా వైద్య అధికారి రజిత, జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రవీణ్ కుమార్, జడ్పీ సీఈవో వినోద్ కుమార్, ఈఈ పీఆర్ సుదర్శన్ రెడ్డి, ఇంచార్జి డీసీహెచ్ఎస్ రవీందర్, ప్రోగ్రామ్ ఆఫీసర్లు, వైద్యులు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్య అవగాహన కల్పించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



