నవతెలంగాణ – పెద్దవూర
పెద్దవూర మండలం సమ్మక్క, సారక్క సమీపంలోని పుష్కర ఘాట్ వద్ద జిల్లా వైద్యాధికారి ఆదేశాల మేరకు బుధవారం మండల వైద్యాధికారి నగేష్ హెల్త్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా డాక్టర్ నగేష్ మాట్లాడుతూ.. గణేష్ నిమజ్జనం జరిగే ప్రదేశాల్లో ఆరోగ్య శాఖ హెల్త్ క్యాంపులు మరియు అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. నిమజ్జనం సందర్భంగా భక్తులకు ఏదైనా జరిగితే వైద్య సదుపాయాలు ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణ వైద్య సదుపాయాలు కల్పిస్తారని అన్నారు.నిమజ్జనం సందర్భంగా జన సమ్మర్ధంగా ఉండే ప్రాంతాలలో అనారోగ్యాలు రాకుండా చూడటం. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించి వైద్యం అందించడం, భక్తులకు అవసరమైన ఆరోగ్య సలహాలు, ప్రాథమిక చికిత్స అందించడం వంటవి నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అత్యవసర వైద్య సేవల కోసం అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచుతామన్నారు. వైద్య, ఆరోగ్య శాఖతో పాటు పోలీసులు నీటి పారుదల శాఖ అధికారులు సమన్వయంతో పనిచేస్తాయని తెలిపారు.
సమ్మక్క, సారక్క పుష్కర ఘాట్ వద్ద హెల్త్ క్యాంపు ఏర్పాటు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES