నవతెలంగాణ -ముధోల్
పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యంగా ఉంటామని రబింద్ర పాఠశాల ప్రిన్సిపల్ అసంవార్ సాయినాథ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన ముధోల్ లోని రబింద్ర పాఠశాలలో ప్రార్థన సమయంలో విద్యార్థులచే స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత తో పాటు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అపరిశుభ్రమైన పరిసరాలతో వివిధ రకాల వ్యాధులకు గురి అవుతామని తెలిపారు. విద్యార్థులకు పాఠశాల స్థాయి నుండి వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్గిఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ రాజేందర్, డైరెక్టర్ పోతన్న యాదవ్, చైర్మన్ భీంరావ్ దేశాయి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES