Saturday, July 26, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలి

ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలి

- Advertisement -

మంత్రి దామోదర ఆదేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

రాష్ట్రంలో వర్షాలు, వాతావరణ మార్పులతో సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారు లను మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరిం చారు. తక్షణమే జిల్లాలకు వెళ్లి, ప్రభుత్వ ఆస్పిత్రుల ను సందర్శించాలని అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి పర్యటనలో ఉన్న మంత్రి.. హెల్త్‌ సెక్రటరీ క్రిస్టినా జడ్‌ చొంగ్తు, ఇతర ఉన్నతాధికారులతో గురువారం టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రివెంటివ్‌ మెజర్స్‌పైన దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ శాఖ అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో అవేర్‌నెస్‌ క్యాంపులు, మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ ప్రాంతాల్లో యాంటిలార్వాల్‌ ఆపరేషన్స్‌, ఫాగింగ్‌, ఇండోర్‌ స్ప్రేయింగ్‌ విస్తృతంగా చేయాలన్నారు. క్రమం తప్పకుండా మంచి నీటి నమూనాలను పరీక్షించా లని చెప్పారు. సీజనల్‌ వ్యాధులతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ, ఐపీ పెరిగే అవకాశం ఉన్నందున, ఓపీ కౌంటర్లను పెంచాలనీ, సమయాన్ని పొడిగిం చుకోవాలని ఆదేశించారు. ప్రయివేటు హాస్పిటళ్లపై నిఘా పెంచాలనీ, డెంగీ, ప్లేట్‌లెట్స్‌ పేరిట ప్రజలను దోచుకునే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బిల్లులు అధికంగా వేసే హాస్పిటళ్లపై నిబంధనల ప్రకారం వ్యవహరించాలని సూచించారు. వ్యవసాయ పనులు ఊపందుకున్న నేపథ్యంలో రైతులు ఎక్కువ సమయం పొలాల్లోనే గడుపుతారనీ, ఈ క్రమంలో పాము, తేలు కాటుకు గురయ్యే ప్రమాదం ఉంటుందనీ, అయితే ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌ నుంచి టీచింగ్‌ హాస్పిటల్‌ వరకూ అన్నింటిలో పాము, తేలు కాటు పేషెంట్లకు ట్రీట్‌ మెంట్‌ అందించేందుకు అవసరమైన మెడిసిన్‌, ఇంజెక్షన్లు అందుబాటులోకి ఉంచుకోవాలన్నారు. అంబులెన్స్‌లు, 102 వాహనాలు అన్నీ సిద్ధంగా ఉంచుకోవాలని, ఎక్కడ ఎమర్జెన్సీ ఉన్నా తక్షణమే వెళ్లి పేషెంట్‌ను తరలించేలా డ్రైవర్లు, ఈఎంటీలను 24 గంటలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. భారీ వర్షాలు, గాలుల వల్ల విద్యుత్‌ అంతరాయం తలెత్తే ప్రమాదం ఉన్నందున, హాస్పిటళ్లలోని జనరేటర్లను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో దగ్గు, జలుబు, జ్వరం, డెంగీ, మలేరియా వంటి సీజనల్‌ వ్యాధుల బారిన పడకుండా ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ కమిషనర్‌ సంగీత సత్యనారాయణ, టీజీఎం ఎస్‌ఐడీసీ ఎండీ ఫణీంద్రరెడ్డి, ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ వాసం వెంకటేశ్వర్‌రెడ్డి, ఆరోగ్యశ్రీ సీఈవో ఉదరుకుమార్‌, పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ రవింద్ర నాయక్‌, మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ నరేంద్ర కుమార్‌, వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ అజరుకుమార్‌, ఆయుష్‌ డైరెక్టర్‌ శ్రీకాంత్‌ బాబు తదితరులు జిల్లాల్లో పర్యటించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -