Tuesday, July 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆరోగ్య విస్తరణ అధికారి శంకర్ కు మహాకవి దాశరథి కవి పురస్కారం..

ఆరోగ్య విస్తరణ అధికారి శంకర్ కు మహాకవి దాశరథి కవి పురస్కారం..

- Advertisement -

నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య విస్తరణ అధికారిగా పనిచేస్తున్న యెనుగందుల శంకర్ కు మహాకవి డాక్టర్.దాశరథి కృష్ణమాచార్యుల శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్ పర్సన్ డాక్టర్ వెన్నెల గద్దర్,జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్,తెలంగాణ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ కనకయ్య చేతుల మీదుగా కవి పురస్కారాన్ని అందుకున్నారు. వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఆరోగ్య విస్తరణ అధికారికి ఈ కవి పురస్కారం లభించడం పట్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ అభినందనలు తెలియజేశారు. వై. శంకర్ నిజామాబాదు జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఆరోగ్య విస్తరణ అధికారిగా విధులు నిర్వహిస్తూనే సాహిత్యసేవ, సామాజిక సేవ చేస్తూ పలువురి మన్ననలు పొందుతున్నారు. కాకతీయ యూనివర్సిటీ లో రసాయన శాస్త్రం లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టా పుచ్చుకున్నారు. శంకర్ అనేక కవితలు, వ్యాసాలు, వ్రాసి ఎన్నో జాతీయ అవార్డ్స్, ప్రశంస పత్రాలు పొందారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -