Wednesday, November 12, 2025
E-PAPER
Homeతాజా వార్తలుకాళేశ్వరం కమిషన్ పై హైకోర్టులో విచారణ వాయిదా

కాళేశ్వరం కమిషన్ పై హైకోర్టులో విచారణ వాయిదా

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు బిగ్ రిలీఫ్ లభించింది. కాళేశ్వరం నివేదిక ఆధారంగా తమపై చర్యలు తీసుకొవద్దని కేసీఆర్‌తో పాటు హరీశ్‌రావు, ఎస్‌కే జోషి, ఐఏఎస్ స్మిత సబర్వాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను జనవరి రెండో వారానికి వాయిదా వేసింది. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయడానికి 4 వారాల గడువు ఇచ్చింది. ప్రభుత్వ కౌంటర్‌కు సమాధానం ఇచ్చేందుకు పిటిషనర్లకు మరో 3 వారాల పాటు టైమ్ ఇచ్చింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -