- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: నటుడు మోహన్‌బాబు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. విలేకరిపై దాడి చేసిన ఘటనలో మోహన్‌బాబుపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి పోలీసు స్టేషన్‌లో నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టేయాలని ఇటీవల మోహన్‌బాబు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై వాదనలు వినిపించడానికి పోలీసుల తరఫు న్యాయవాది సమయం కోరారు. తదుపరి విచారణను హైకోర్టు 9వ తేదీకి వాయిదా వేసింది.
- Advertisement -