Saturday, October 18, 2025
E-PAPER
Homeతాజా వార్తలుశిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కకు హృదయపూర్వక ధన్యవాదాలు

శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కకు హృదయపూర్వక ధన్యవాదాలు

- Advertisement -


– డా.హిప్నో పద్మా కమలాకర్
ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : రాష్ట్రంలోని యువతలో అవగాహన పెంచి, కుటుంబాల్లో స్థిరత్వం తీసుకురావాలనే ఉన్నత దృష్టితో వివాహ పూర్వ కౌన్సెలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినందుకు గౌరవనీయ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సీతక్కకు ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు డా.హిప్నో పద్మా కమలాకర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, లయన్స్ క్లబ్ 320ఎ ఆధ్వర్యంలో డా. హిప్నో కమలాకర్ మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ లో ముఖ్యమైన సమావేశం శనివారం ఉదయం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సాగర్ల రఘు, సెక్రటరీ డా.పి.రమేష్ కుమార్, డా.వి.జే.ఇ. క్యార్లిన్,అన్నమయ్య జిల్లా అధ్యక్షురాలు షాహినా పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ఈ నిర్ణయం సమాజానికి ఎంతో అవసరమైనదన్నారు. ఈ కేంద్రాల ద్వారా పెళ్లికి ముందే యువతకు మానసిక, భావోద్వేగ, సామాజిక అవగాహన కలగడం వల్ల అనవసర విభేదాలు తగ్గి, సుస్థిరమైన, సంతోషకరమైన దాంపత్య జీవితాన్ని ప్రారంభిస్తామన్నారు. ప్రస్తుతం విడాకులు, వివాహ విభేదాలు పెరుగుతున్న ఈ కాలంలో, ప్రభుత్వం తీసుకున్న ఈ అడుగు మంచి మాట, మంచి మార్గం, మంచి మనసు కలయికగా నిలుస్తుందని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించబోయే ఈ కేంద్రాలు ప్రేమ, పరస్పర గౌరవం, సహనం అనే విలువలను పెంపొందించేలా పనిచేయాలని సూచించారు. సైకాలజిస్ట్ లను ఎక్కువ సంఖ్యలో నియమించాలని కోరారు. ప్రతి జిల్లా కేంద్రంలో ఈ సేవలు ఉచితంగా లభించటం మరో గొప్ప విషయమన్నారు.
ఈ దిశగా ముందడుగు వేసిన మంత్రి సీతక్క గారు సమాజ శ్రేయస్సు, మహిళా సాధికారత, కుటుంబ బలపాటుకు ప్రతీకగా నిలుస్తుందన్నారు.ఆమె నాయకత్వం దూరదృష్టికి మా తరఫున హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -