నవతెలంగాణ – భీంగల్
భీంగల్ దేయికాల మోట వద్ద చెక్ డామ్ కట్ట తెగి వరద నీరు ప్రవాహం వల్ల 22 విద్యుత్ స్తంభాలు నేలకొరగడం జరిగింది. కొన్ని రోజుల క్రితం, పంట సాగునీటి కొరత వల్ల నాటు వెయ్యవలసిన పంటలు, అక్కడక్కడ నాటు వేసిన పంటలు వర్షాలు లేక ఎండి ఎడారిలా మారడం జరిగింది. భూగర్భజలాలు తగ్గడం వల్ల పంటలు ఎండిపోయాయి.మిగిలిన పంటలను బోరు నీరు సహాయంతో కాపాడుకుందామంటే నడిపించుకోవడానికి లేకుండా గత నెల 27,28, 29 తేదీలలో కురిసిన అకాల వర్షానికి వరద నీరు ఎక్కువ వచ్చింది. దీంతో వాగులలో నిర్మించిన చెక్ డామ్ రెండు వైపులా కట్టలు తెగిపోయి, ఆ వరద నీరు పంట చేన్లను, విద్యుత్ స్తంభాలను, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు నాశనం చేశాయి. మిగిలిన పంటను కాపాడుకోవడానికి రైతులు పడుతున్న కష్టాలు అంతా ఇంతా కాదు…భారీ వర్షాల కారణంగా విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు నీటమునిగి దెబ్బతిన్నాయి, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. నేలకొరిగిన విద్యుత్ స్తంభాల ప్లేసులో విద్యుత్ స్తంభం మాదిరిగా కట్టెలకు పిట్టేలను అమర్చి, విద్యుత్ స్తంభాల వాయర్లను అమర్చడం జరిగింది.
భారీ వరద నీరు… రైతులకు కన్నీరు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES