- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయంలోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 8 గేట్లను 10 అడుగులు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో ఇన్ ఫ్లో 2,93,609 క్యూసెక్కులుగా ఉండగా.. ఔట్ ఫ్లో 2,82,502 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 882.80 అడుగులకు చేరుకుంది. కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.
- Advertisement -