- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో సహాయక బృందాలను సిద్ధంగా ఉంచాలన్నారు. ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను ముందుగానే మోహరించాలని చెప్పారు. భారీవర్షాల సూచన నేపథ్యంలో ఉన్నతాధికారులతో సీఎం మాట్లాడారు. వాగులు పొంగే ప్రమాదమున్న జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లోని కుటుంబాలను సహాయక శిబిరాలకు తరలించాలని చెప్పారు. జలాశయాలను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని సూచించారు.
- Advertisement -