Monday, October 13, 2025
E-PAPER
Homeఖమ్మంఅశ్వరావుపేటలో భారీ వర్షం

అశ్వరావుపేటలో భారీ వర్షం

- Advertisement -

– రాకపోకలకు అంతరాయం
నవతెలంగాణ – అశ్వారావుపేట

కొద్దిసేపు కురిసిన వర్షానికే రాష్ట్రీయ రహదారి ముంపుకు గురైంది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సోమవారం అశ్వారావుపేట నియోజకవర్గంలో కురుస్తున్న భారీ వర్షాలకు తల్లాడ – దేవరపల్లి రాష్ట్రీయ రహదారిలో అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం సమీపంలో రహదారి పైకి వర్షపు నీరు చేరడంతో వాహనాలు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

రోడ్ కనిపించని తీవ్రతతో వర్షపు నీటితో ముంపు కు గురికావడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఉత్తర భారత్ నుంచి ప్రారంభమైన నైరుతి రుతుపవనాలు తెలంగాణ ప్రాంతానికి చేరుకోవడంతో పాటుగా ఈ నెల 15 వ తేదీకి రుతుపవనాలు  పూర్తిస్థాయిలో నిష్క్రమించే అవకాశాలు ఉండటంతో రాబోయే మూడు రోజులు భారీగా వర్షాలు పడే సూచనలున్నాయి అని వాతావరణ నిపుణులు తెలిపారు. అయితే ఈ రోడ్ కు ఇరువైపులా గృహాలు,ఉద్యాన నర్సరీలు ఏర్పాటు కావడంతో వర్షపు నీరు పారుదల కు కాలువలు లేకపోవడంతో వర్షపునీరు రోడ్డు పైకి పారుతుంది. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -