– విద్యుత్ సరఫరాకు అంతరాయం
– వర్షంలోనే విద్యుత్ మరమ్మత్తులు చేసిన సిబ్బంది
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండలంలో శనివారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. అర్ధరాత్రి నుండి మొదలైన వర్షం తెల్లవారుజాము వరకు పో మోస్తారుగా పడింది. తెల్లవారు సమయంలో పెద్ద ఎత్తున ఈదురుగాళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో మండలంలో పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరకు అంతరాయం ఏర్పడింది. మండల కేంద్రంలో ఈదురు గాలుల మూలంగా చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడడంతో విత్ సరఫరా నిలిచిపోయింది.
పంట పొలాల్లో పలుచోట్ల విద్యుత్ తీగలు నేల వాలాయి. దీంతో కొన్ని గంటలసేపు మండల కేంద్రంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ శాఖ సిబ్బంది సకాలంలో స్పందించి ఎక్కడెక్కడ విద్యుత్ ఇబ్బందులు తలెత్తయో గుర్తించి, వర్షంలోనే తడుస్తూ విద్యుత్ స్తంభాలను ఎక్కి తక్షణమే మరమ్మతులు పూర్తి చేశారు. విద్యుత్ తీగలకు తాకుతున్న చెట్ల కొమ్మలను తొలగించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా విద్యుత్ సమస్యలను పరిష్కరించి, విద్యుత్తును పునరుద్ధరించిన సిబ్బందికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. కాగా గత కొద్దిరోజులుగా వర్షాల కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలు భారీ వర్షం కురవడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారి వర్షాల మూలంగా పంటలకు జీవం పోసినట్లయిందని పేర్కొంటున్నారు.
మండలంలో తెల్లవారుజామున భారీ వర్షం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES