Sunday, July 6, 2025
E-PAPER
Homeజాతీయంవిశాఖలో భారీ వర్షం..

విశాఖలో భారీ వర్షం..

- Advertisement -

నవతెలంగాణ – అమరావతి: విశాఖలో భారీగా వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. పలు ఇండ్లు, కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రోడ్లపై వర్షపు నీరు ఏరులై పారుతోంది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరోవైపు ఉదయం నుంచి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాలలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దొండపర్తి నెహ్రూబజార్‌లో కురిసిన భారీ వర్షం దెబ్బకు కమర్షియల్ బిల్డింగ్ శ్లాబ్ కుప్పకూలిపోయింది. వ్యాపారులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వర్షాల నేపథ్యంలో జీవీఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. పలు కాలనీల్లో సహాయ చర్యలు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -