నవతెలంగాణ-హైదరాబాద్: వరంగల్‌లో ఈ ఉదయం కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. నగరంలోని రైల్వే అండర్ బ్రిడ్జి కిందకు భారీగా వరద నీరు చేరడంతో ఆ మార్గంలో వెళ్తున్న రెండు ఆర్టీసీ బస్సులు పూర్తిగా చిక్కుకుపోయాయి. బస్సుల్లో ఉన్న సుమారు వంద మంది ప్రయాణికులు ప్రాణభయంతో ఆర్తనాదాలు చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
రిస్థితిని గమనించిన స్థానికులు తక్షణమే మిల్స్ కాలనీ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సహకారంతో ఒక పెద్ద తాడును బస్సుల వద్దకు చేరవేసి, దాని సాయంతో ప్రయాణికులను ఒక్కొక్కరిగా సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సుమారు వంద మందిని కాపాడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.