Sunday, October 5, 2025
E-PAPER
Homeతాజా వార్తలుహైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం..

హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : హైదరాబాద్ నరగంలో ఆదివారం తెల్లవారుజామున భారీ వర్షం ప్రారంభం అయింది. నిన్న రాత్రి నుంచి చల్లని వాతావరణం ఏర్పడగా.. ఈ రోజు ఉదయం ఉన్నట్టుండి.. ఒక్కసారిగా భారీ వర్షం కురుస్తుంది. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాల్లు పూర్తిగా జలమయం అయ్యాయి. ఇప్పటికే నల్లటి మేఘాలు నగరం మొత్తం కమ్మేయగా.. ప్రస్తుతం.. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, లక్డీకపూల్, ట్యాంక్ బండ్, అమీర్ పేట్, సోమాజీగూడ, కోటి ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తుంది.

ఊహించని ఈ భారీ వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ట్యాంక్ బండ్ పై నిమజ్జనాల కోసం దుర్గ మాత విగ్రహాలతో వచ్చిన వారు పూర్తిగా వర్షంలో తడిసి పోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఇదిలా ఉంటే ఈ రోజు హైదరాబాద్ నగరంతో పాటు, తెలంగాణలోని అన్ని జిల్లా్ల్లో మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ప్రస్తుతం నగరంలో భారీ వర్షం కురుస్తుండడంతో అప్రమత్తం అయిన జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది రంగంలోకి దిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -