- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: మహాబలిపురం సమీపంలో తీవ్ర అల్పపీడనం తీరం దాటింది. దీని ప్రభావంతో చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో రాబోయే 48 గంటల పాటు అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. చెన్నైలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. భారీ వర్షాల కారణంగా అనేక వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. పుదుచ్చేరిలోనూ భారీ వర్షాలు కురుస్తున్నందున విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
- Advertisement -



