నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
భారీ వర్షం ఆదిలాబాద్ జిల్లాను అతలాకుతలం చేసింది. కొన్ని గంటల వ్యవధిలోనే కుంభవృష్టి సృష్టించి ఆగమాగం చేసింది. శనివారం ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి వాగులు వంకలు పొంగిపొర్లాయి. జలపాతాలు ఉదృతంగా ప్రవహించాయి. పట్టణంలో ఉన్న పలు కాలనిలో ఇండ్లలోకి నీరు చేరింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సంప్రదించగా సహాయక చర్యలు చేపట్టారు. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
పట్టణంలోని సుభాష్ నగర్ బ్రిడ్జ్ పై నుండి నీరు భారీగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయయి. వాగు సమీపన నిర్మించుకున్న ఇంటి యజమానులు పరుగులు తీశారు. అటు కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ వరద ప్రాంతాల్లో పర్యటించి పరిశీలించారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీమంత్రి జోగురామన్న పలు ప్రాంతాల్లో కాలనీల్లో పర్యటించి పరిస్థితిని పరిశీలించారు. ఏదైతే అది కొన్ని గంటల్లోనే ఆదిలాబాద్ జిల్లాను ఎన్నడూ లేనివిధంగా ఆగమాగం చేయడంతో ప్రజలు ఆందోళన చెందారు.
ఆదిలాబాద్ ను ముంచెత్తిన కుంభవృష్టి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES