- Advertisement -
వతెలంగాణ – హైదరాబాద్ : వరద సహాయక చర్యలు, విపత్తు నిర్వహణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరించాలని ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి సహాయక చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలని కోరింది. సెప్టెంబర్ 17వ తేదీలోపు పూర్తి రిపోర్ట్ అందజేయాలని చెప్పింది. తదుపరి విచారణ వాయిదా వేసింది.
- Advertisement -