నవతెలంగాణ – ముధోల్
నిర్మల్ జిల్లాలో డిసెంబర్ 14న జరగనున్న రెండవ విడత పంచాయతీ ఎన్నికలకు పోలీస్ శాఖ పగడ్బందీ గా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. ముధోల్ సర్కిల్ పోలీస్ స్టేషన్ లో రెండవ విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన బందోబస్తు ఏర్పాట్లపై శనివారం జిల్లా ఎస్పీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రం వద్ద నిర్వహించాల్సిన బందోబస్తు, పెట్రోలింగ్ టీమ్ ల ఏర్పాటు , తదితర వాటిపై ఎస్పీ పోలిసులకు పలు సూచనలు, సలహాలు తెలియజేశారు. ఆనంతరం ఎస్పీ విలేకరులతో మాట్లాడారు. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి నిర్మల్ పోలీసులు అన్ని బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈసమావేశంలో భైంసా అడిషనల్ ఎస్పీ రాజేష్ మీనా,ముధోల్ సిఐ మల్లేష్, భైంసా రూరల్ సిఐ నైలు, బాసర సిఐ సాయి కూమార్, ముధోల్ ఎస్ఐ బిట్ల పెర్సిస్, లోకేశ్వరం ఎస్ఐ గుమ్ముల అశోక్, కుంటాల ఎస్ఐ అశోక్,తానుర్ ఎస్ఐ నవనీత్, తదితరులు పాల్గొన్నారు.
రెండవ విడత జీపీ ఎన్నికలకు భారీ బందోబస్తు: ఎస్పీ జానకి షర్మిల
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



