నవతెలంగాణ-హైదరాబాద్: ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత కల్పించారు. కోల్‌కతాలో ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం వద్ద బందోబస్తు పెంచారు. ‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా’లో భాగంగా మెస్సి భారత్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కోల్‌కతాలోని సాల్ట్‌లేక్ స్టేడియంలో నుంచి మెస్సి తొందరగా వెళ్లిపోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాటిళ్లు, కుర్చీలు విసిరేశారు.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఫ్రెండ్లీ మ్యాచ్ జరగనున్న ఉప్పల్‌స్టేడియం పరిసరాల్లో 3 వేల మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. మెస్సి మ్యాచ్‌కు టికెట్ ఉన్నవాళ్లను మాత్రమే అనుమతించనున్నారు. 34 చోట్ల పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. ఉప్పల్ స్టేడియం, పరిసరాల్లో సీసీటీవీ కెమెరాలు, డ్రోన్లతో పర్యవేక్షించనున్నారు. స్టేడియం వద్ద భద్రతను డీజీపీ శివధర్‌రెడ్డి పరిశీలించారు.
షెడ్యూల్ ఇదే..
రాత్రి 7.50కి మెస్సి- గోట్ ఫుట్‌బాల్ మ్యాచ్ ప్రారంభం కానుంది.
రాత్రి 8.06కి సీఎం రేవంత్‌రెడ్డి, మెస్సి మైదానంలోకి దిగనున్నారు
రాత్రి 8.08కి రోడ్రిగో, లూయిస్ సువారెజ్ మైదానంలోకి వస్తారు
రాత్రి 8.13కి పెనాల్టీ షూటౌట్
రాత్రి 8.18కి మైదానంలోకి దిగనున్న రాహుల్ గాంధీ



