నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణలో ఆగష్టు 23 వరకు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొన్నది. మంగళవారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఒడిశాలోని గోపాల్‌పూర్ సమీపంలో తీరం దాటిందని, ఈ వాయుగుండం వాయువ్య దిశలో కదిలి దక్షణ అంతర్గత ఒడిశా ప్రాంతంలో ఆగ్నేయంగా 90 కి.మీ దూరలో కేంద్రీకృతమైందని పేర్కొన్నది. ఈ వాయుగుండం రాగల 24 గంటల్లో పశ్చిమ, వాయువ్య దిశలో కదిలి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఈనెల 24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం కూడా ఉన్నదని పేర్కొంది.
ఈనెల 23 వరకు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES