నవతెలంగాణ-హైదరాబాద్: దేశ రాజధానిలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వరద నీటితో రోడ్లలన్ని చెరువులను తలపిస్తున్నాయి. గురుగ్రామ్- దిల్లీ హైవేపై పెద్దఎత్తున ట్రాఫిక్ స్తంభించి.. ఆయా మార్గాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. రోడ్లలపై గంటల తరబడి కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. తాజాగా ఆ ట్రాఫిక్‌ను తప్పించుకునేందుకు ఓ వ్యక్తి ఏకంగా.. తన బైక్‌ను భుజాలపై మోసుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాల్లో వైరల్ అవుతుంది.
మరోవైపు పలు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు యమునా నది ఉప్పొంగుతోంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలను వరద నీరు చుట్టుముట్టింది. పలు కాలనీలు నీట మునిగిపోయి. గురువారం ఇక్కడ ఉరుములతో కూడిన వర్షం పడొచ్చని భారత వాతావరణశాఖ హెచ్చరిక జారీ చేసింది.
https://www.instagram.com/reel/DOFrsUbkVeJ/?utm_source=ig_embed&ig_rid=0469be70-de9c-4c64-b2f0-be49fdbf507c