- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్డుపై శిల్పా లేవుట్ ప్లైఓవర్ వద్ద కారు ఆగిపోవడంతో మంగళవారం ఉదయం కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. దీనివల్ల ఆఫీసులకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాయదుర్గం, గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఐటీ కారిడార్‌లో ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ సమస్యలు నిత్యకృత్యమయ్యాయి. వాహనాల వేగం 10-30 కి.మీ.కి పరిమితమై, 10 కి.మీ. దూరం ప్రయాణించడానికి గంటకు పైగా సమయం పడుతోంది.
- Advertisement -



