Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్గూపన్-పల్లి గ్రామంలో హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం

గూపన్-పల్లి గ్రామంలో హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్
తన కిడ్డీ బ్యాంకు లో కూడబెట్టిన నగదు తో అయిదేళ్ల ఓ చిన్నారి హెల్మెట్ లను బహుకరించింది. అదికూడా తన అయిదో జన్మ దినం రోజే. నగరంలో సీఐసీ కాలనీ కి చెందిన సంధి అద్విక తన కిడ్డీ బ్యాంకు లో దాచుకున్న నగదు ను సామాజిక ప్రయోజనాల కోసం వెచ్చించాలని ఆలోచనతో తల్లీ మౌనిక,  తండ్రి బెన్ని ల సూచన మేరకు 60 హెల్మెట్ లను కొనుగోలు చేయించింది.ఆ హెల్మెట్ లను నిరుపేదలకు మంగళవారం తన జన్మదినం రోజు నుడా చైర్మన్ కేశవ వేణు, రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, సీఐ ప్రసాద్ ల చేతుల మీదుగా పంపిణీ చేశారు.

గూపన్ పల్లి గ్రామానికి చెందిన బెన్ని తన కుమార్తె సంధి అద్విక పుట్టినరోజు సందర్భంగా సామాజిక సేవలో భాగంగా 60 హెల్మెట్లను గ్రామ ప్రజలకు పంపిణీ చేయించడం అభినందనీయమని నుడా చైర్మన్ కేశవ వేణు, రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ తెలిపారు. ఈ సందర్భంగాట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ..హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాలను కాపాడుకోవచ్చు అని ప్రజలకు అవగాహన కల్పించారు. ఏసీపీ మస్తాన్ అలీ మాట్లాడుతూ.. హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తప్పవు అని ద్విచక్ర వాహనదారులను హెచ్చరించారు. కార్యక్రమాన్ని నిర్వహించిన బెన్ని గారికి ట్రాఫిక్ అధికారులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసులు, గ్రామ పెద్దలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad