Monday, January 5, 2026
E-PAPER
Homeఖమ్మంప్రమాదంలో హెల్మెట్ ప్రాణాధారం

ప్రమాదంలో హెల్మెట్ ప్రాణాధారం

- Advertisement -

– ఎస్.హెచ్.ఓ యయాతి రాజు
నవతెలంగాణ – అశ్వారావుపేట

ద్విచక్ర వాహనదారులు తప్పని సరిగా హెల్మెట్లు ధరించాలని,అనుకోని పరిస్థితుల్లో ప్రమాదం సంభవిస్తే హెల్మెట్ ప్రాణాధారం గా ఉంటుందని ఎస్.హెచ్.ఓ ఎస్సై యయాతి రాజు హెచ్చరించారు. రహదారి భద్రతా అవగాహన మాసం – 2026 లో భాగంగా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు శనివారం అశ్వారావుపేట – భద్రాచలం రహదారిలో ప్రమాదాలను నివారించడానికి అవగాహన కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగా ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ఆవశ్యకత,సరైన నెంబర్ ప్లేట్ కలిగి లేకపోవడం వంటి వాటిపై కలిగే అనర్ధాలు,చట్టపరమైన చర్యల ను వివరించారు. కార్యక్రమంలో ఎస్సై అఖిల, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -