Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంఇరాన్‌-ఇజ్రాయిల్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో హెల్ప్‌లైన్‌ ఏర్పాటు

ఇరాన్‌-ఇజ్రాయిల్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో హెల్ప్‌లైన్‌ ఏర్పాటు

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఇరాన్‌-ఇజ్రాయిల్‌ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో, ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న లేదా ప్రయాణిస్తున్న తెలంగాణ వాసులు, విద్యార్థులకు సహాయమందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ప్రారంభించింది. విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రెండు దేశాల భారత రాయబార కార్యాలయాల నుంచి లభించిన తాజా సమాచారం ప్రకారం, ఇప్పటి వరకు తెలంగాణకు చెందిన ఎవరూ ప్రభావితం కాలేదు. అయినప్పటికీ, భవిష్యత్‌ పరిణామాల దృష్ట్యా ముందు జాగ్రత్తగా హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణ భవన్‌ సీనియర్‌ అధికారులు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖతో, ఆయా దేశాల రాయబార కార్యాలయాలతో నిరంతరం సంప్రదిస్తూ అవసరమైతే తక్షణ సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సహాయం కోసం ప్రజలు వందన, పి.ఎస్‌, రెసిడెంట్‌ కమిషనర్‌ 91 9871999044, జి. రక్షిత్‌ నాయక్‌, లైజన్‌ ఆఫీసర్‌ -91 9643723157, జావేద్‌ హుస్సేన్‌, లైజన్‌ ఆఫీసర్‌ 91 9910014749, సిహెచ్‌.చక్రవర్తి, పౌర సంబంధాల అధికారి- 91 9949351270 నెంబర్లలో సంప్రదించవచ్చు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad