Sunday, June 22, 2025
E-PAPER
Homeతాజా వార్తలుమానవత్వం చాటుకున్న హీరో మోహన్ లాల్

మానవత్వం చాటుకున్న హీరో మోహన్ లాల్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తనలోని మానవత్వాన్ని చాటుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు. నిన్న ఆయన తన 65వ పుట్టినరోజును జరుపుకున్నారు.1960 మే 21న జన్మించిన ఆయన, నాలుగు దశాబ్దాలకు పైగా తన అద్భుత నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ పుట్టినరోజు సందర్భంగా మోహన్ లాల్ రెండు కీలకమైన సేవా కార్యక్రమాలను ప్రకటించి తన గొప్ప మనసును చాటుకున్నారు. కేరళలో కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న నిరుపేద చిన్నారులకు అతి తక్కువ ఖర్చుతో కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు చేయించనున్నట్లు మోహన్ లాల్ ప్రకటించారు. “చాలా మంది చిన్నారులు కాలేయ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వారిలో అనేకమందికి ఈ ఆపరేషన్ అత్యవసరం. అలాంటి వారందరికీ తన ఫౌండేషన్ అండగా నిలుస్తుంది” అని ఆయన తెలిపారు. తన విశ్వశాంతి ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -