Saturday, August 2, 2025
E-PAPER
Homeబీజినెస్మోటర్ సైకిళ్లు & స్కూటర్లను పంపిణీ చేసిన హీరో మోటోకార్ప్

మోటర్ సైకిళ్లు & స్కూటర్లను పంపిణీ చేసిన హీరో మోటోకార్ప్

- Advertisement -

నవతెలంగాణ – న్యూఢిల్లీ : ప్రపంచంలో అత్యధిక మోటర్ సైకిళ్లు మరియు స్కూటర్ల తయారీదారు అయిన హీరో మోటోకార్ప్ జూలై 2025లో 449,755 యూనిట్లను పంపిణీ చేసింది. తద్వారా జూలై 2024లో నమోదైన 370,274 యూనిట్ల కంటే 21% పెరుగుదలను నమోదు చేసింది.

 పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో మార్కెట్ ట్రెండ్‌లకు అనుగుణంగా  జూలై 2025లో హీరో మోటోకార్ప్ 339,827 యూనిట్లకు పైగా వాహన్* రిటైల్ రిజిస్ట్రేషన్లు పూర్తి చేసింది. రిటైల్ కార్యకలాపాలు స్థిరంగా కొనసాగుతున్నాయి.  పండుగ సీజన్‌ రాబోతుండటంతో, రాబోయే నెలల్లో ఈ అమ్మకాలు మరింత పెరుగుతాయని అంచనా.

*ఆగస్టు 1, 2025 నాటికి తెలంగాణ మినహా వాహన్ నుండి డేటా.

ఈ నెలలో, కంపెనీ కీలక విభాగాలలో తన కార్యకలాపాలను విస్తృతం చేసుకుంది . స్కూటర్లలో, డెస్టినీ 125 మరియు జూమ్ 125 యొక్క అమ్మకాల ద్వారా మార్కెట్ వాటా పరంగా మెరుగైన ఫలితాలు కనిపించాయి.మోటర్ సైకిల్ విభాగంలో, హీరో మోటోకార్ప్ తమ హెచ్ఎఫ్ డీలక్స్ ప్రోను విడుదల చేయటం ద్వారా హెచ్ఎఫ్ డీలక్స్ పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. మెరుగైన డిజైన్,  విభాగం లో అత్యున్నత ఫీచర్లు మరియు అత్యుత్తమ ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఈ మోడల్, విస్తృత శ్రేణి కస్టమర్ల కోసం ఎంట్రీ-లెవల్ మోటర్‌సైకిల్ సెగ్మెంట్ యొక్క ఆకర్షణను పెంచుతుంది.

హీరో మోటోకార్ప్ తో శక్తివంతమైన విడా, జూలై 2025లో ఒక ప్రధాన మైలురాయిని చేరుకుంది. తమ నెల వారీ అత్యధిక వాహన యూనిట్లు 11,226 పంపిణీ చేయబడటం తో పాటుగా  10,489 వాహన్ రిజిస్ట్రేషన్‌లు జరగటం ద్వారా చక్కటి ప్రదర్శన చేసింది. కంపెనీ తన ఈవీ వాహన్ మార్కెట్ వాటాను ఇయర్ ఓ ఇయర్ రెట్టింపు చేసి 10.2%కి చేర్చింది, ఇది హీరో మోటోకార్ప్ యొక్క ఎలక్ట్రిక్ మొబిలిటీ పోర్ట్‌ఫోలియో ను  వినియోగదారులు  వేగంగా స్వీకరించడాన్ని నొక్కి చెబుతుంది.

ఇటీవల విడుదల చేయబడిన VIDA Evooter VX2 – “బదల్తే ఇండియా కా స్కూటర్” అసాధారణమైన మార్కెట్ ప్రతిస్పందనను పొందింది, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలో దాని స్థానాన్ని బలోపేతం చేసింది. VIDA Evooter దాని విప్లవాత్మక బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) మోడల్‌తో నిరూపితమైన స్కూటర్ విశ్వసనీయతతో ఎలక్ట్రిక్ ఆవిష్కరణలను కలపడం ద్వారా కొత్త రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది, ఇది వినియోగదారులకు ఈవీ స్వీకరణను సులభతరం చేస్తుంది.

దాని బలమైన వృద్ధి పథాన్ని నిర్మించడంతో పాటుగా  పరిశ్రమ ధోరణుల కంటే ముందుండటం ద్వారా, హీరో మోటోకార్ప్ యొక్క ప్రపంచ వ్యాపారం జూలై 2025లో చక్కటి  ప్రదర్శనను కొనసాగించింది, అమ్మకాలు 37,300 యూనిట్లను మించిపోయాయి. కంపెనీ యొక్క విస్తరిస్తున్న ప్రపంచ కార్యకలాపాలు ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు నమ్మకమైన, అధిక-నాణ్యత , సాంకేతికంగా-అధునాతన మొబిలిటీ పరిష్కారాలు , ఉత్పత్తులను అందించడంలో దాని నిబద్ధతను వెల్లడిస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -