Saturday, December 6, 2025
E-PAPER
Homeజాతీయంఉత్తరప్రదేశ్‌లో హై అలర్ట్‌

ఉత్తరప్రదేశ్‌లో హై అలర్ట్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: 1992, డిసెంబర్ 6న బాబ్రీ మ‌సీదును దుండ‌గులు కూల్చివేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో శనివారం ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యతో పాటు ఇతర సున్నిత ప్రాంతాలలో ఉన్న‌తాధికారులు హై అలర్ట్‌లో ప్ర‌క‌టించారు. స్థానిక పోలీసులు ప్రధాన మార్గాల్లో వాహన తనిఖీలను నిర్వహిస్తూ, నగరంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు.

న‌గరంలోని వివిధ ప్రదేశాలలో తనిఖీలు నిర్వహిస్తున్నామని, హోటళ్లు, ధర్మశాలల్లో బస చేసిన సందర్శకుల రికార్డులను తనిఖీ చేస్తున్నామన్నారు. నగరంలో వాహనాలను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తున్నామని, తమ బృందాలు ఘాట్‌లు, ఇతర ప్రాంతాలలో కూడా గస్తీ తిరుగుతున్నాయని అయోధ్య పోలీసు సూపరింటెండెంట్ (ఎస్‌పీ) చక్రపాణి త్రిపాఠి తెలిపారు. 84 ఘాట్‌లలో పెట్రోలింగ్ ముమ్మరం చేశామని, ముఖ్యంగా అస్సీ ఘాట్, నమో ఘాట్, దశాశ్వమేధ ఘాట్‌లలో సాయంత్రం హారతి సమయంలో ప్రత్యేక నిఘా కొనసాగుతున్నదన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -