సీఎం సొంత జిల్లాలో విద్యార్థులు
అస్వస్థతకు గురైనా పరామర్శించని వైనం :
మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు
నవతెలంగాణ – తిమ్మాజిపేట/ కల్వకుర్తి
గురుకులాల్లో జరుగుతున్న సంఘటనపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుమోటోగా కేసు స్వీకరించాలని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు. నాగర్‌కర్నూల్ జిల్లా ఉయ్యాలవాడ మహాత్మా జ్యోతి బాపూలే బాలికల గురుకుల పాఠశాలలో శనివారం రాత్రి కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న హరీశ్‌రావు.. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, గువ్వల బాలరాజ్‌తో కలిసి ఆదివారం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్ధులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం చేతగానితనం, నిర్లక్ష్యం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా యని తెలిపారు. పిల్లలకు మంచి భోజనం పెట్టకుండా, వారికి సరైన వైద్యం అందించకుండా.. దాచి పెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రతిరోజూ ఏదో ఒక జిల్లాలో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయని, కానీ సీఎం విద్యార్ధులను గురించి ఏ మాత్రం పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడైనా ఫుడ్ పాయి జన్ అయితే అధికారులను సస్పెండ్ చేస్తానని ప్రగల్భాలు పలికిన సీఎం రేవంత్.. తన సొంత జిల్లాలో విద్యా ర్థులు ఆస్పత్రి పాలైతే కూడా స్పందిం చకపోవడంతో పాటు వారిని పరామ ర్శించడానికి కూడా రాకపోవడం దారుణమన్నారు. అందాల పోటీల్లో లక్ష రూపాయలకు ప్లేట్ భోజనం పెట్టేందుకు ఉన్న డబ్బులు.. పిల్లలకు కడుపునిండా అన్నం పెట్టేందుకు డబ్బులు లేవా అని ప్రశ్నించారు. గురు కులాల్లో మెనూ కూడా రాష్ట్ర ప్రభుత్వం పాటించడం లేదని ఆరోపించారు. ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన సంఘ టనన్నారు. విద్యార్ధుల జీవితాలతో చెలగాటం ఆడకుండా వారికి సరైన భోజనం అందించాలని, లేకుంటే మళ్లీ గురుకుల బాట పట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. హ్యూమన్ రైట్స్ కమిషన్ సుమోటోగా తీసుకొని రాష్ట్రంలో గురుకుల హాస్టల్స్ లో జరుగుతున్న సంఘటనలపై విచారణ చేయాలని కోరారు.
గురుకులాల ఘటనలను హైకోర్టు సుమోటోగా స్వీకరించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES