Thursday, November 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతులు పండించిన నూనె పంటలకు అధికంగా డిమాండు

రైతులు పండించిన నూనె పంటలకు అధికంగా డిమాండు

- Advertisement -

– దుబ్బాక ఆత్మ కమిటీ ఛైర్మెన్ గాంధారి నరేందర్ రెడ్డి
నవతెలంగాణ – తొగుట

రైతులు పండించిన నూనె పంటలకు అధికంగా డిమాండు ఉందని దుబ్బాక ఆత్మ కమిటీ ఛైర్మెన్ గాంధారి నరేందర్ రెడ్డి అన్నారు. గురువారం రైతు వేదికలో దుబ్బాక ఆత్మ కమిటీ ఛైర్మెన్ గాంధారి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు లకు జాతీయ నూనె గింజల పథకం (ఎన్ఏంఈవో – వోఎస్)లొ భాగంగా రాయితీ పై పొద్దు తిరుగుడు విత్తనాలు  పంపిణి చేసారు .అనంతరం ఆత్మ కమిటీ ఛైర్మెన్ మాట్లాడుతు రైతులు నూనె పంటలకు సాగు చేసి అధిక లాభాలు పొందాలని సూచించారు. జాతీయ ఆహార భద్రత పోషక మిషన్ పథకంలో భాగంగా రైతులకు మక్క జొన్న విత్తనాలు పంపిణి చేసారు. రైతులు తమ యొక్క పట్టాదార్ పాస్ బుక్, ఆధార్ కార్డు తో వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్ర దించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ డైరెక్టర్లు, రైతులు, వ్యవసాయ అధికారి మోహన్, వ్యవసాయ విస్తరణ అధికారులు తదితరులు పాల్గొన్నారు .

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -