Saturday, August 2, 2025
E-PAPER
Homeబీజినెస్అధిక సుంకాలతో జీడీపీ తగ్గొచ్చు

అధిక సుంకాలతో జీడీపీ తగ్గొచ్చు

- Advertisement -

– వృద్ధి 30 బేసిస్‌ పాయింట్లు తగ్గొచ్చు : బార్క్‌లేస్‌ అంచనా
న్యూఢిల్లీ :
అమెరికా విధిస్తున్న అధిక సుంకాలు భారత జీడీపీని దెబ్బతీయనున్నాయని విత్త సంస్థ బార్క్‌లెస్‌ విశ్లేషించింది. భారత వస్తువులపై 25 శాతం సుంకాలు సహా రష్యన్‌ దిగుమతులపై అదనపు జరిమానా విధిస్తున్నట్టు ట్రంప్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పరిణామం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీని 30 బేసిస్‌ పాయింట్లు (0.3 శాతం) తగ్గించనుందని అంచనా వేసింది. అమెరికాతో వాణిజ్య చర్చలు కొనసాగుతున్నందున.. తుది సుంకాలు 25 శాతం కంటే తక్కువగా ఉండవచ్చని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి 6.5 శాతంగా ఉండొచ్చని ఆర్‌బిఐ, ఐఎంఎఫ్‌ 6.4 శాతంగా, ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ 6.5 శాతంగా అంచనా వేశాయి. అమెరికా అధిక సుంకాలతో భారత్‌కు చెందిన ఫార్మాస్యూటికల్స్‌, రత్నాలు, వస్త్రాలు వంటి రంగాలు సుంకాల ప్రభావాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. వ్యవసాయం , డెయిరీ రంగాలలో మార్కెట్‌ యాక్సెస్‌ విషయంలో భారతదేశం గతంలో జాగ్రత్తగా వ్యవహరించిందని మూడీస్‌ అనలిటిక్స్‌ అసోసియేట్‌ ఎకనమిస్ట్‌ అదితి రామన్‌ పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -