- Advertisement -
నవతెలంగాణ – దామరచర్ల
రైతులు నానో యూరియాను ఉపయోగించడం వల్ల ఖర్చు తగ్గడం తోపాటు, అధిక దిగుబడి ని సాధించవచ్చని మండల వ్యవసాయ అధికారి రూషేంద్రమని చెప్పారు. దామరచర్ల లో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు.నానో యూరియాను వాడడం వలన సాంప్రదాయ యూరియాతో పోలిస్తే ఖర్చు తగ్గుతుందని, పంట దిగుబడి పెరుగుతుందని చెప్పారు. నానో యూరియా రైతులకు అందుబాటులో వున్నదని చెప్పారు. ఈ కార్యక్రమములో ఏ ఈ ఓ లు సైదులు, ప్రియాంక, పార్వతి, సురేష్, మధు, శేఖర్ పాల్గొన్నారు.
- Advertisement -