ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్ : రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ శ్రీధర్‌కుమార్ లోథ్
నవతెలంగాణ-హనుమకొండ చౌరస్తా
రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో యూనివర్సిటీలకు అధిక నిధులు కేటాయించాలని తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ శ్రీధర్ కుమార్ లోథ్ డిమాండ్ చేశారు. బుధవారం హనుమకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో డాక్టర్ ఎస్. సతీష్ కుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో విద్యారంగానికి సరిపడ నిధులు కేటాయించలేదని, అలా కాకుండా తెలంగాణలో ప్రవేశపెట్టబోయే 2026-27 బడ్జెట్‌లో 20శాతం నిధులు విద్యారంగానికి కేటాయించాలని కోరారు.
అలాగే, 12 యూనివర్సిటీలకు బ్లాక్ గ్రాంట్ రూ.2000 కోట్లు కేటాయించాలని, అభివృద్ధి కింద మరో రూ.5000 కోట్లు కేటాయించాలని అన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయానికి రూ.190 కోట్ల బ్లాక్ గ్రాండ్ ఇవ్వాలని, అభివృద్ధికి మరో రూ.500 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల 100 సంవత్సరాల్లో అడుగుపెడుతున్న సందర్భంలో రూ.1000 కోట్లు కేటాయించాలని, యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులకు యూజీసీ పే-స్కేల్ ఇవ్వాలని కోరారు. పార్ట్ టైం అధ్యాపకులను కాంట్రాక్టు అధ్యాపకులుగా మార్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల ఫ్యాక్టరీ క్లబ్ చైర్మెన్ డాక్టర్ దామెర బిక్షపతి, డాక్టర్ సదానందం, డాక్టర్ ఆర్. కళ్యాణి, డాక్టర్ రాజు, డాక్టర్ శివకుమారి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర బడ్జెట్‌లో యూనివర్సిటీలకు అధిక నిధులు కేటాయించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



