Saturday, July 5, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంప్రధాని మోడీకి అత్యున్నత సత్కారం

ప్రధాని మోడీకి అత్యున్నత సత్కారం

- Advertisement -

ది ఆర్డర్‌ ఆఫ్‌ ట్రినిడాడ్‌ అండ్‌ టోబాగో అందజేత
ట్రినిడాడ్‌:
ప్రధాని మోడీకి ట్రినిడాడ్‌ అండ్‌ టోబాగో అత్యున్నత సత్కారం ‘ది ఆర్డర్‌ ఆఫ్‌ ట్రినిడాడ్‌ అండ్‌ టోబాగో’ను శుక్రవారం ప్రధాని కమ్లా పెర్సాద్‌ బిస్సేర్‌ అందజేశారు. అంతకు ముందు జరిగిన సమావేశంలో.. ట్రినిడాడ్‌ అండ్‌ టోబాగోలో భారతీయ సమూహాన్ని ధైర్యానికి ప్రతీకగా ప్రధాని నరేంద్ర మోడీ అభివర్ణించారు. వారి పూర్వీకులు ఎదుర్కొన్న కఠిన పరిస్థితులను గుర్తు చేశారు. బ్రిటిష్‌ పాలనలో బీహార్‌ నుంచి గిర్మిత్‌ కూలీలుగా వివిధ దేశాలకు తరలించబడ్డ భారతీయుల (గిర్మితియాలు) ప్రయాణాన్ని ఈ సందర్భంగా మోడీ గుర్తు చేసుకున్నారు. బ్రిటిష్‌ ఇండియా నుంచి బానిసత్వ విధానంలో విదేశాల్లోని తోటలలో కూలీగా పనిచేయించేందుకు పంపిన కార్మికులనే గిర్మితియాలు అంటారు. కౌవాలోని నేషనల్‌ సైక్లింగ్‌ వెలో డ్రోమ్‌లో భారతీయ సమూహంతో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధాని మోడీ కీలక కామెంట్స్‌ చేశారు. మనమంతా ఒకే కుటుంబంలో భాగమని తనకు ఈ సమావేశం తెలియజేస్తోందంటూ పేర్కొన్నారు. ట్రినిడాడ్‌ అండ్‌ టోబాగోలో సుమారు 13 లక్షల జనాభా ఉంటే అందులో 45 శాతం మంది భారతీయ మూలాలున్న ఉన్నవారే అని చెప్పారు. అంత ేకాదు, ట్రినిడాడ్‌ లోని ప్రవాసులపై ప్రశంసలు కురిపించారు. ”మీ పూర్వీ కులు గంగా, యమునా తీరాలను విడిచిపెట్టినా, రామాయణాన్ని హదయంలో మోస్తూనే వచ్చారు. వారు సమస్యలను పట్టుదలతో ఎదుర్కొ న్నారు. ఈ భూమిలోకి భారతీయ నాగరికతను తీసుకొచ్చారు” అని మోడీ చెప్పారు.
ట్రినిడాడ్‌ ప్రధాని బీహార్‌ కుమార్తె
ట్రినిడాడ్‌ అండ్‌ టోబాగో అభివృద్ధిలో సాంస్కృతిక, ఆర్థిక, ఆధ్యాత్మిక రంగాల్లో నాటి నుంచి భారతీయ సమాజం ఎనలేని సేవలను అందించినట్టు మోడీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీహార్‌ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తింపు పొందిన ట్రినిడాడ్‌ ప్రధాని కమ్లా పెర్సాద్‌ బిస్సేర్‌ను మోడీ గుర్తు చేశారు. ఆమెను బీహార్‌ కుమార్తె అభివర్ణించారు. ఆమె పూర్వీకులు బీహార్‌లోని బక్సర్‌ జిల్లాకు చెందినవారని పేర్కొన్నారు. ”ట్రినిడాడ్‌ ప్రధాని పూర్వీకులు బీహార్‌లోని బక్సర్‌కు చెందినవారు. ఆమె స్వయంగా 2012లో తన తాతముత్తాతల ఊరు బీహారులోని భేలుపూర్‌ను సందర్శించారు. బిహారీ ప్రజలు ఆమెను తమ కుమార్తెగా భావిస్తారు” అని మోడీ చెప్పారు. భారత్‌ ప్రస్తుతం ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా ఉన్నదని మోదీ ఈ సందర్భంగా వివరించారు. ”త్వరలోనే మన దేశం ప్రపంచంలోని టాప్‌ 3 ఆర్థిక శక్తుల్లో ఒకటవుతుంది. ఈ అభివృద్ధి ప్రపంచానికి ప్రయోజనకరంగా ఉండేలా మేం కృషి చేస్తున్నాం. భారత్‌ ఈరోజు అవకాశాల దేశంగా మారింది” అని ఆయన అన్నారు. ప్రతి ప్రవాసుడు భారత్‌కు దూతగా భావించాలన్నారు. ”మీరు భారతదేశపు సాంస్కృతిక విలువలను, సంప్రదాయానికి ప్రతీకలు. మీరు మన దేశ గర్వకారణం” అని మోడీ చెప్పారు. మోడీ పర్యటనలో భాగంగా ఇరు దేశాధినేతల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. 1999 తర్వాత ట్రినిడాడ్‌ ను భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి. ట్రినిడాడ్‌ అండ్‌ టోబాగో పార్లమెంటు ఉమ్మడి సమావేశంలో ప్రసంగించనున్న తొలి భారత ప్రధాని మోడీయే కావడం గమనార్హం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -