నవతెలంగాణ-మద్నూర్: సంగారెడ్డి నాందేడ్ అకోలా హైదరాబాద్ 161వ జాతీయ రహదారి నాలుగు లైన్ల రోడ్డును నిర్మించారు. రోడ్డు నిర్మాణంలో చేపట్టవలసిన నిబంధనలను ఉల్లంఘినట్లు కనిపిస్తోంది. ఈ రహదారి నిర్మాణానికి రోడ్లపైకి ఎలాంటి పశువులు రాకూడదని దానికి రోడ్డుకు ఇరువైపులా కంచ వేయవలసి ఉండగా.. మధ్యలో కంచ లేకపోవడం తరుచు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. నాలుగు లైన్ల రోడ్డుపై భారీ వాహానాలు అతివేగంతో రావడంతో మనుషులతో పాటు పశువులు ప్రమాదానిని గురై చనిపోతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రోడ్డు నిర్మాణం చేపట్టిన సదురు కాంట్రాక్టర్ పూర్తిస్థాయిలో రహదారికి ఇరువైపులా కంచ పూర్తిస్థాయిలో వేయలేదని, దీంతో కంచలేని చోట నుంచి మనుషులు, పశువులు ప్రమాదాలకు గురువౌతున్నారు. వెంటనే స్పందించి సంబంధిత అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
కంచ లేని 161వ హైవే.. ప్రమాదాలకు బాధ్యులెవరు?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES