Saturday, November 1, 2025
E-PAPER
Homeతాజా వార్తలువిద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట హిజ్రాల ఆందోళన...

విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట హిజ్రాల ఆందోళన…

- Advertisement -

నవతెలంగాణ  – షాద్ నగర్ రూరల్ : షాద్ నగర్ పట్టణ కేంద్రంలోని విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట హిజ్రాలు ఆందోళకు దిగారు. పట్టణంలోని సిఎస్కే వెంచర్ లో కరెంట్ కోతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ  ఏఈ కార్యాలయం.వద్ద ఆందోళన చేశారు. సీఎస్కే విల్లాస్ ఫేస్ 2లో యాజమాన్యం నిర్వాకం కారణంగా కరెంటు సరఫరాను విద్యుత్ శాఖ అధికారులు నిలిపి వేయడంతో రాత్రింబవళ్లు కరెంటు లేకపోవడంతో విసుగెత్తిన సీఎస్కే ఫేసు 2 విల్లాస్ లో నివాసముంటున్న కొంత మంది హిజ్రాలు శనివారం విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై ఆగ్రహంతో షాద్ నగర్ పట్టణ విద్యు శాఖ ఏఈ వినోద్ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయం ముందు హిజ్రాల బృందం నాయకురాలు సంగీత ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ పై దుమ్మెత్తి పోశారు.

హిజ్రాలు సహనం నశించి అధికారులను బండబూతులు తిట్టారు. అయితే మొదట విల్లాస్ లు అమ్మిన సీఎస్కే వెంచర్ ఓనర్ సురేష్ అగర్వాల్ ఆ తర్వాత శిల్ప సంస్థ వారికి తిరిగి ఫేస్ టు ప్రాంతాన్ని అమ్మివేశారని, ప్రస్తుతం ఇరువురి మధ్య ఉన్న విభేదాల కారణంగా ఇప్పుడు ఇక్కడ విల్లాస్ కొన్న వారికి పూర్తిగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఇక్కడ అద్దెకు ఉన్నవారు కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని గత మూడు రోజులుగా కరెంటు లేక నానాయా తన పడుతున్నామని హిజ్రాలు తెలిపారు .  సీఎస్కే వెంచర్ యజమాని చాలామందికి ఇక్కడ ఇండ్లు అమ్మిన తర్వాత కరెంటు ఏర్పాటు విషయంలో నిర్లక్ష్యం వహించడంతో ఈ సమస్య ఏర్పడిందని తెలిపారు. కనివిని ఎరుగని విధంగా హిజ్రాలు విద్యుత్ శాఖ కార్యాలయానికి వచ్చి శాపనార్ధాలు పెడుతూ బండ బూతులు తిడుతు నానా శాపనార్ధాలు పెట్ట డంతో అధికారులు తలలు పట్టుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -