- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: జంట జలాశయాల్లో ఒకటైన హిమాయత్ సాగర్ నాలుగు గేట్లను అధికారులు ఒక అడుగు మేర ఎత్తారు. హిమాయత్ సాగర్‌కు భారీగా వరద నీరు చేరుతుండటంతో అధికారులు గురువారం రాత్రి 10 గంటలకు ఒక గేట్ ఒక అడుగు ఎత్తి మూసీలోకి నీటిని వదిలారు. శుక్రవారం ఉదయం వరకు వరద భారీగా చేరుతుండటంతో అధికారులు మరో మూడు గేట్లను ఒక అడుగు మేర ఎత్తి నీటిని వదిలారు. హిమాయత్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 1763.50అడుగులు కాగా ప్రస్తుతం 1763.20 అడుగులకు చేరింది.
- Advertisement -