- Advertisement -
నవతెలంగాణ – రామారెడ్డి
మండలంలోని రెడ్డిపేట జిల్లా పరిషత్ పాఠశాలలో హిందీ భాష దినోత్సవం, ఏక్ భారత్, శ్రేష్ట భారత్ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏ గోపాల్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సందర్భంగా విద్యార్థులకు ఉపన్యాస పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించామని, ప్రతి పని చూపిన విద్యార్థులకు జ్ఞాపికలను అందజేశామని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -