రూ.2 కోట్ల 31 లక్షలు పలికిన లడ్డు
నవతెలంగాణ-గండిపేట్
రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని కీర్తి రీచ్ మండ్ విల్లాస్‌లో ప్రతిష్టించిన గణేష్ లడ్డు వేలం పాట చరిత్ర సృష్టించింది. ఏకంగా రూ.2 కోట్ల31 లక్షల ధర పలికింది. ప్రతి ఏడాదీ 10 కిలోల లడ్డును వినాకుడి చేతిలో పెడుతున్నారు. నవరాత్రులు ముగిసిన తరువాత వేలం పాట నిర్వహిస్తారు. అయితే, రీచ్ మండ్ విల్లాస్‌లో అక్కడి వారంతా నాలుగు గ్రూపులుగా విడిపోయి వేలం పాట పాడుతారు. ఎక్కువ మొత్తం పాడిన గ్రూపును వేలంలో గెలిచినట్టు ప్రకటిస్తారు. మిగిలిన గ్రూపుల వాళ్లు పాడిన మొత్తం కూడా వేలంలో కలిపేస్తారు. దాంతో భారీ మొత్తం జమ అవుతుంది. ఆ డబ్బుతో ఆర్‌వి దియా చారిటబుల్ ట్రస్ట్ పేరుతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విద్య, వైద్యం తదితర అవసరాలకు ఈ డబ్బును ఖర్చు చేస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. గతేడాది ఈ లడ్డు రూ.1.87 కోట్లు పలికింది.
చరిత్ర సృష్టించిన రీచ్ మండ్ విల్లాస్ లడ్డు వేలం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES