Wednesday, July 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గురుకుల పాఠశాలకు ఎంపికైన విద్యార్థినికి సన్మానించి వీడ్కోలు పలికిన హెచ్ఎం

గురుకుల పాఠశాలకు ఎంపికైన విద్యార్థినికి సన్మానించి వీడ్కోలు పలికిన హెచ్ఎం

- Advertisement -

నవతెలంగాణ –  జుక్కల్  : మండలంలోని బిజ్జల్ వాడి గ్రామ ఎంపీపీ ఎస్ పాఠశాల నాలుగవ తరగతి విద్యార్థినికి గ్రామ పెద్దలతో కలిసి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈ . రవీకుమార్ ఆధ్వర్యంలో చిన్నారికి  వీడ్కోలు సభ లో ఘనంగా సన్మానించారు . ఈ సందర్భంగా హెచ్ఎం రవికుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులే అత్యధికంగా విద్యను అభ్యసిస్తున్నారు అని అన్నారు . మారుమూల మహారాష్ట్ర సరిహద్దు గ్రామం అయినా బిజ్జల్ వాడి లో అత్యధికంగా మరాఠీ , కన్నడ మాట్లాడే వారు ఎక్కువ ఉండడంతో ఇక్కడి పిల్లలకు తెలుగు భాష పై మక్కువ తక్కువ ఉండడం గమనించామని అన్నారు. అటువంటి వారిని గుర్తించిన విద్యార్థులను తెలుగులోనే మాట్లాడేందుకు విద్యార్థులకు నిత్యం తెలుగు భాష బోధన చేస్తున్నామని తెలిపారు. ఇప్పుడిప్పుడే తెలుగు భాష పై గ్రామంలో మక్కువ పెంచుకొని కొంతమంది మాట్లాడడం జరుగుతుందని ఇది మంచి మార్పు అని అన్నారు. అదేవిధంగా గ్రామంలో బడిబాట కార్యక్రమం నిర్వహించినామని , కొత్తగా విద్యార్థులను పాఠశాలలో అడ్మిషన్  చేస్తున్నామని తెలిపారు .  ప్రస్తుతం పరిస్థితులలో ప్రైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలే మేలు అని గ్రామంలో ర్యాలీగా తిరుగుతూ గ్రామస్తులకు తెలిపామని తెలిపారు . ప్రభుత్వ పాఠశాలలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే బోధించబడుతున్నదని  సూచించారు . తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపవద్దని , ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే పంపించి వారి పిల్లల భవిష్యత్తును  మార్గదర్శకంగా ఉండే విధంగా విద్యాభివృద్ధికి తల్లిదండ్రులు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మరియు విద్యార్థిని , విద్యార్థులు వారి కుటుంబ సభ్యులు , గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు .

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -