Wednesday, October 29, 2025
E-PAPER
Homeజిల్లాలునేడు ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్లకు సెలవు

నేడు ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్లకు సెలవు

- Advertisement -

నవతెలంగాణ కల్వకుర్తి టౌన్ 

కల్వకుర్తి ప్రాంతంలో ప్రభుత్వ ప్రయివేటు పాఠశాలలకు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ భాదావత్ సంతోష్ సెలవు ప్రకటించారు. రాష్ట్రంలో మొంథా తుఫాను కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు ఏరులై పారుతున్నాయి. 

ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ కుమార్ ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వీలైనంతవరకు ఇండ్ల నుంచి బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ వర్షాల కారణంగా శిథిలా వ్యవస్థలో ఉన్న ఇండ్లు కూలిపోయే ప్రమాదం ఉన్నందున సురక్షిత ప్రాంతాల్లో ప్రజలు ఉండాలని కలెక్టర్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -