- Advertisement -
నవతెలంగాణ-రాజన్న సిరిసిల్ల: సిరిసిల్లలోని ఎస్పీ కార్యాలయం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హోంగార్డు దేవయ్య అక్కడికక్కడే మృతి చెందాడు దేవయ్య. సోమవారం సాయంత్రం జిల్లా ఎస్పీ కార్యాలయంలో తన విధులు ముగించుకొని కార్యాలయం నుంచి తన ద్విచక్ర వాహనంపై బైపాస్ రోడ్డుకు ఎక్కుతుండగా రోడ్డుపై అతివేగంగా వస్తున్న కారు ఢీకొట్టడంతో దేవయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. అతివేగంగా ఉన్న కారు పల్టీలు కొట్టి రోడ్డు కిందకు దూసుకెళ్లింది ఈ ప్రమాదంలో మృతి చెందిన హోంగార్డు దేవయ్య తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లికి చెందిన వ్యక్తి. విషయం తెలుసుకున్న ఎస్పి మహేష్ బిగితే వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. సీఐ కృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
- Advertisement -



