Tuesday, July 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పాల సంఘం చైర్మన్ కు సన్మానం..

పాల సంఘం చైర్మన్ కు సన్మానం..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : భువనగిరి మండలంలోని అనాజిపురం నూతన పాలసంఘం చైర్మన్ గా మర్రి సత్యనారాయణ , డైరెక్టర్ గా కర్నాటి నాగరాజు లు ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా సీపీఐ(ఎం) అనాజిపురం గ్రామ శాఖ ఆధ్వర్యంలో వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ జిల్లా ప్రధాన  కార్యదర్శి ,మాజీ సర్పంచ్ బొల్లేపల్లి కుమార్  వారికీ పూలమాలలు వేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులూ ఎదునూరి మల్లేశం, గునుగుంట్ల శ్రీనివాస్, శాఖ కార్యదర్శి అబ్దుల్లాపురం వెంకటేశం, నాయకులూ మహమ్మద్ జహంగీర్, ఎదునూరి వెంకటేశం, కడారి కృష్ణ, గంగనబోయిన బాలనర్సింహ, గంగనబోయిన పాండు, తోటకూరి మల్లేశం, ఆకుల బిక్షపతి, మహమ్మద్ వలి, గంగనబోయిన బాలకృష్ణ, ముస్తఫా, బొల్లేపల్లి మల్లయ్య, మల్లయ్య, గంగాధరి భాను లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -