Thursday, September 18, 2025
E-PAPER
Homeఆదిలాబాద్జన్నారం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఎస్సైలకు సన్మానం...

జన్నారం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఎస్సైలకు సన్మానం…

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
 జన్నారం ఎస్సైగా విధులు నిర్వహించి బదిలీపై రామగుండం కమిషనరేట్ వీఆర్గా గా బదిలీ అయిన రాజవర్ధన్, బదిలీపై అదే కమిషనరేట్ నుండి జన్నారం ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన జి.అనుషను మండల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రెస్ క్లబ్ భవనంలో శాలువాలతో  ఘనంగా సన్మానించారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండి సమాజానికి సమాచారం తెలియపరిచే నాలుగవ స్తంభం పాత్రికేయులేనని అన్నారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చిలువేరు నరసయ్య, గౌరవాధ్యక్షులు మందపల్లి కాంతయ్య, ఉప ఉపాధ్యక్షులు వెంబడి మల్లేష్, కోశాధికారి శీలం చంద్రశేఖర్  ప్రచార కార్యదర్శి జాడి వెంకటయ్య, పూదరి సత్యనారాయణ, గోనే సత్యం కందుల రమేష్, శ్రీనివాస్ నరసయ్య సుధీర్  అజ్మత్ ఖాన్ శివరామకృష్ణ, సతీష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -