Saturday, September 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సేవా పక్షంలో దివ్యాంగులకు సన్మానం 

సేవా పక్షంలో దివ్యాంగులకు సన్మానం 

- Advertisement -

నవతెలంగాణ – చండూరు 
భారత నరేంద్ర మోడీ జన్మదినోత్సవం నుండి గాంధీ జయంతి వరకు తలపెట్టిన సేవా పక్షంలో భాగంగా బీజేపీ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు పందుల సత్యం గౌడ్ ఆధ్వర్యంలో శనివారం ఆ పార్టీ  కార్యాలయంలో  దివ్యాంగులకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా  బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు శాగ చంద్రశేఖర్ రెడ్డి దివ్యాంగులకు సన్మానం చేసిన అనంతరం మాట్లాడుతూ.. సేవాపక్షాన్ని పురస్కరించుకుని పదిహేను రోజుల పాటు మొక్కలు నాటడం, స్వఛ్ఛ భారత్, కళాకారులకు, నిరుపేదలకు, దివ్యాంగులకు సన్మానం సేవలు చేయడం తదితర కార్యక్రమాలు చేయడం సంతోషంగా ఉందని అన్నారు. 

దివ్యాంగుల సమస్యలు పరిష్కరించడానికి, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇప్పించేందుకు బిజెపి ఆధ్వర్యంలో కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు కోమటి వీరేశం, జిల్లా నాయకులు సముద్రాల వెంకన్న, అన్నెపర్తి యాదగిరి, బోడ ఆంజనేయులు, సామ వెంకట్ రెడ్డి, ఇరిగి ఆంజనేయులు, పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ శంకర్, తోకల రవీందర్, పల్లెగోని చంద్రమౌళి, చిట్టిప్రోలు వెంకటేశం, రామలింగం, మంచుకొండ సాగర్, ఇరిగి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -