నవతెలంగాణ – తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాటాపూర్ జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలకు చెందిన ఎస్కే నిజాముద్దీన్, కాట శ్వేత అనే విద్యార్థులకు సోమవారం జడ్పిహెచ్ఎస్ కాటాపూర్ హై స్కూల్ ఆవరణలో శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు బాణాల సుధాకర్, విద్యార్థుల తల్లిదండ్రులను కూడా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బాగా కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు.
వారి తల్లిదండ్రులు పేదరికంలో ఉండి కష్టపడి చదివించినందుకు విద్యార్థులకు త్రిబుల్ ఐటీలో సీటు వచ్చినందుకు వారి శ్రమకు గుర్తింపు తీసుకొచ్చారని కొనియాడారు. ఉన్నత చదువు పూర్తి చేసి మన జిల్లాకు, మండలానికి మన గ్రామం కాటాపూర్ కు మంచి గుర్తింపు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బాణాల సుధాకర్, ఉపాధ్యాయులు సక్రు, మాజీ సర్పంచ్ ముజాఫర్, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దమనిషి మీరాన్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.