Tuesday, July 29, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఘోరం.. అత్తను వేటకొడవలితో హత్య చేసిన అల్లుడు

ఘోరం.. అత్తను వేటకొడవలితో హత్య చేసిన అల్లుడు

- Advertisement -

హత్యకు సహకరించిన తమ్ముడు
నిందితుల పరారు
నవతెలంగాణ – మద్దూరు

కుటుంబ తగాదాలతో అత్తను తమ్ముడి సహకారంతో అతి కిరాతకంగా అల్లుడు హత్య చేసిన సంఘటన మండలంలోని మర్మముల శివారు బంజర గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన జంగిలి యాదగిరి వజ్రమ్మలకు ఒక కుమారుడు, ఒక కూతురు. కుమారుడు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కూతురు భవానిని ధర్మారం గ్రామానికి చెందిన జక్కుల కనకయ్య కుమారుడు జక్కుల మహేష్ కు ఇచ్చి 9 సంవత్సరాల క్రితం వివాహం జరిపించారు.

వీరికి ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. హైదరాబాదులో నివాసం ఉంటూ సాఫీగా సాగుతున్న సంసారంలో మహేష్, భవాని, మధ్య నిత్యం గొడవలు జరగడంతో ఈనెల 27న మహేష్ పై భవాని మద్దూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహించి, ఇకముందు ఇద్దరు మంచిగా కలిసి ఉండాలని తెలిపారు. దీంతో భవానీని ఆమె ముగ్గురు పిల్లలను తండ్రి తల్లి జంగిలి యాదగిరి, వజ్రమ్మ,లు ధర్మారం తీసుకువచ్చి మహేష్ ఇంట్లో వదిలి వెళ్లారు. సోమవారం హైదరాబాద్ వెళ్తానని వెళ్లిన మహేష్ బంజరకు వెళ్లి హైదరాబాదులో అమీన్ పూర్, ఇంటి తాళం చెవిలు ఇవ్వాలని అత్తమామలను కోరాడు.

ఇందుకు వారు నిరాకరించారు. దీంతో మహేష్ కోపంతో ఊగిపోయి ధర్మారం వచ్చి తన తమ్ముడు హరీష్, ను తీసుకొని బంజరాకు వచ్చారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో గ్రామంలోని జంగిలి మల్లేశం ఇంటి వద్ద మహేష్ అత్త జంగిలి వజ్రమ్మ, అక్కడే ఉండడంతో ఒక్కసారిగా తమ్ముడు హరీష్ సాయంతో అత్త వజ్రమ్మపై వేట కొడవలితో మహేష్ దాడి చేసి హత్య చేశారు. అక్కడే ఉన్న గ్రామస్తులు అరవడంతో వెంటనే మహేష్ హరీష్ లు పరారయ్యారు. హత్య విషయం తెలుసుకున్న మద్దూరు ఎస్సై షేక్ మహబూబ్ , సిద్దిపేట క్లూస్ టీం అధికారులకు సమాచారం అందించి హత్యకు సంబంధించిన ఆధారాలను సేకరించారు.

ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. హత్య చేసిన నిందితులను త్వరలో పట్టుకొని రిమాండ్ కు తరలిస్తామని ఆయన తెలిపారు. బంజరలో హత్య జరగడంతో హుస్నాబాద్ సిఐ శ్రీను, చేర్యాల ఎస్సై నవీన్, కొమురవెల్లి ఎస్ఐ రాజు,లు శాంతిభద్రతలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పర్యవేక్షించారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -